Namaste NRI

మిస్ టీన్ అమెరికాగా భారత సంతతి బాలిక

భారతీయ సంతతికి చెందిన మెక్సికో పౌరురాలు, హైస్కూలు విద్యార్థిని ఉమాసోఫియా శ్రీవాస్తవ మిస్ టీన్ యుఎస్‌ఎ 2023 కిరీటాన్నిగెలుచుకుంది. అమెరికాలోకి నెవడా రాష్ట్రంలో జరిగిన అందాల పోటీల్లో ఈ కిరీటం ఉమాసోఫియాకు దక్కింది.  అకాడమి ఆఫ్ సెయింట్ ఎలిజబెత్‌లో హైస్కూలు జూనియర్‌కు చెందిన 16 ఏళ్ల ఉమాసోఫియా ఈ ఏడాది మొదట్లో జరిగిన మిస్ న్యూజెర్సీ టీన్ యుఎస్‌ఎని గెలుచుకున్న మొదటి మెక్సికన్– ఇండియన్‌గా నిలిచింది. ఇది కలో నిజమో అర్థంకావడం లేదంటూ ఉమా సోఫియా ఆనందాన్ని వ్యక్తం చేశారు. తన జీవితంలో ఇది గొప్ప అనుభూతిగా ఆమె తెలిపారు. ఇంగ్లీష్, స్పానిష్, హిందీ, ఫ్రెంచ్ మాట్లాడగల ఉమాసోఫియా ఐక్యరాజ్యసమితి రాయబారి కావాలన్నదే తన జీవితాశయంగా చెప్పుకొచ్చింది. భారత్‌లోని మురికివాడల్లోని పిల్లలకు మంచి విద్య, సరైన పౌష్ఠికాహారం, ఆరోగ్య సంరక్షణ కల్పించడం కోసం కృషి చేస్తున్న లోటస్ పెటల్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థకోసం ఉమాసోఫియా పనిచేస్తోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events