అమెరికాలో భారత సంతతికి చెందిన బాలిక నటాషా పెరియనాయగం (13) అద్భుత ఘనత సాధించింది. వరల్డ్ బ్రైటెస్ట్ స్టూడెంట్స్ జాబితాలో పెరియనాయగం నటషా చోటుదక్కించుకుంది. ఈ జాబితాలో నటషా చోటు సంపాదించడం వరుసగా రెండో ఏడాది. అమెరికాకు చెందిన జాన్ హప్కిన్స్ సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్ ప్రతి ఏటా ఈ టాలెంట్ టెస్టును నిర్వహిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 76 దేశాల్లో 15 వేల మంది విద్యార్థులు రాసిన గ్రేడ్ లెవల్ పరీక్షల ఫలితాల ఆధారంగా జాన్ హప్కిన్ సెంటర్ ఈ జాబితాను రూపొందిందించి. పెరియనాయగం నటషా న్యూ జెర్సీలోని ఫ్లోరెన్స్ ఎం గౌడినీర్ మిడిల్ స్కూల్‌లో విద్యాభ్యాసం చేస్తున్నది. జాన్ హప్కిన్స్ సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్ గత ఏడాది నిర్వహించిన టాలెంట్ టెస్టులో కూడా నటషా గ్రేడ్ 5 స్టూడెంట్‌గా నిలిచింది. సెంటర్ నిర్వహించిన అన్ని పరీక్షల్లో నటషా అద్భుతమైన ప్రతిభ కనబర్చిందని జాన్ హప్కిన్స్ యూనివర్సిటీ పేర్కొన్నది. పెరియనాయగం తల్లిదండ్రులు చెన్నై నుంచి అమెరికాకు వలస వెళ్లారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)