Namaste NRI

నిజామాబాద్ ఐటీ హ‌బ్‌లో గ్లోబ‌ల్ లాజిక్ కంపెనీ

నిజామాబాద్ ఐటీ హ‌బ్‌లో త‌మ కంపెనీల‌ను ఏర్పాటు చేయ‌డానికి ప్ర‌ముఖ సంస్థ‌లు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నాయి. తాజాగా అంతర్జాతీయంగా పేరొందిన ప్ర‌ముఖ హిటాచి గ్రూప్ స‌బ్సిడ‌రీ సంస్థ గ్లోబ‌ల్ లాజిక్ త‌న కంపెనీని నిజామాబాద్ ఐటీ హ‌బ్‌లో ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించింది. ఈ నేప‌థ్యంలో బీఆర్ఎస్ ఎన్నారై సెల్ కో-ఆర్డినేట‌ర్ మ‌హేష్ బిగాల హ‌ర్షం వ్య‌క్తం చేశారు. గ్లోబ‌ల్ లాజిక్ కంపెనీ ఏర్పాటుకు మార్గం సులువు చేసిన ఎమ్మెల్సీ క‌విత‌కు ఆయ‌న ధ‌న్య‌వాదాలు తెలిపారు.  ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ స్థానికులకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో వివిధ జిల్లాలలో ఐటీ హబ్‌ల‌ను ఏర్పాటు చేయడానికి అన్ని రకాలుగా సహకరిస్తున్న ఐటీ మంత్రి కేటీఆర్‌కు, ఇక్కడే వివిధ సంస్థలను ఏర్పాటు చేసేందుకు విదేశీ ప్రతినిధులు రావడానికి సహకరించిన ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌గుప్తా, బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్‌కు మహేష్ బిగాల ధన్యవాదాలు తెలిపారు.  నిజామాబాద్‌లో తాము కల్పించే ఉద్యోగాల్లో మహిళలకు పెద్దపీట వేస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events