సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో మనబడి తెలుగు విద్యార్థుల స్నాతకోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 29న సింగపూర్‌లోని మెరీనా బే సాండ్స్ ఎగ్జిబిషన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమం లో పెద్ద ఎత్తున తెలుగువారు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి మా తెలుగు తల్లికి గీతాలాపనతో ప్రారంభిం చారు. సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షుడు బొమ్మారెడ్డి శ్రీనివాస రెడ్డి ప్రారంభోన్యాసం చేశారు.
ఈతరం వారికి తెలుగు భాష అవసరాన్ని వివరిస్తూ సమాజం అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు. 2022-23, 2023-14 విద్యా సంవత్సరాల్లో ప్రవేశం, ప్రసూనం తరగతుల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా తెల్లటి కండువా కప్పి మెడల్‌తో పాటు సిలికానాంధ్ర, సింగపూర్ తెలుగు సమాంజ స్నాతకోత్సవ ధ్రువపత్రాలను బహుకరించినట్లు కార్యక్రమ నిర్వహకులు స్వామి గోపి కిషర్ తెలిపారు. ఈ సందర్భంగా గోపీ మాట్లాడుతూ 2022-23, 2023-24 విద్యా సంవత్సరంలో ప్రవేశం, ప్రస్తుత తరగతులలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా తెల్లటి పైకండువా కప్పి, మెడల్ తో పాటు సిలికానాంధ్ర, సింగపూర్ తెలుగు సమాజం స్నాతకోత్సవ ధృవపత్రాలను బహుకరించామని తెలిపారు. మంచి అభిరుచితో తెలుగు నేర్చుకుంటున్న విద్యార్థులను అభినందిస్తూ, మనబడి కార్యక్రమానికి సహకారం అందిస్తున్న ఉపాధ్యాయులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షుడు బొమ్మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సాంబశివ రావు, తెలుగు సమాజం గౌరవ కార్యదర్శి అనిల్ కుమార్ పోలిశెట్టి ,ఉపాధ్యక్షులు పాలెపు మల్లికార్జున్, కురిచేటి జ్యోతీశ్వర్, సింగపూర్ తెలుగు సమాజం కార్యవర్గం శ్రీనివాసరెడ్డి పుల్లన్నగారి, టేకూరి నాగేష్, కురిచేటి స్వాతి, వైదా మహేష్, కొత్త సుప్రియ, ప్రతిమ, దేదీప్య, శ్రీలక్ష్మి, కిరణ్ కుమార్, గోపి కృష్ణ, రంగనాధ్, గీత, శ్రీలత, విజయ వాణి పాల్గొన్నారు.