Namaste NRI

ముచ్చటగా మూడోసారి జోడీ

అల్లు అర్జున్‌తో  అగ్ర కథానాయిక  రష్మిక మందన్న ముచ్చటగా మూడోసారి జోడీకట్టబోతున్నదని ప్రచారం జరుగుతున్నది. అల్లు అర్జున్‌, అట్లీ కాంబినేషన్‌లో భారీ పాన్‌ వరల్డ్‌ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశమిదని సమాచారం. భారీ వ్యయంతో సన్‌పిక్చర్స్‌ సంస్థ నిర్మించనుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పూర్వ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నెలలోనే సెట్స్‌మీదకు వెళ్లనుందని చెబుతున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్నను కథానాయికగా ఖరారు చేయబోతున్నారని తెలిసింది. పుష్ప సిరీస్‌ చిత్రాలతో బన్నీ, రష్మిక మందన్న హిట్‌ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకోవడంతో, అదే సెంటిమెంట్‌ను కొనసాగించాలన్నది మేకర్స్‌ ఆలోచనగా చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త ఫిల్మ్‌ సర్కిల్స్‌లో విస్త్రతంగా ప్రచారం జరుగుతున్నది.

Social Share Spread Message

Latest News