Namaste NRI

చ‌రిత్ర సృష్టించిన అమెరికా… దాదాపు 50 ఏండ్ల తర్వాత  

అమెరికాకు చెందిన ఓ ప్రైవేటు కంపెనీ చ‌రిత్ర సృష్టించింది. చంద్రుడిపై స్పేస్‌క్రాఫ్ట్‌ను దించిన  తొలి ప్రైవేటు కంపెనీగా హూస్ట‌న్‌కు చెందిన ఇన్‌ట్యూటివ్ మెషీన్స్ రికార్డు నెల‌కొల్పింది. ఆ కంపెనీకి చెందిన ఒడిస్సీ రోబోను,  చంద్రుడి ద‌క్షిణ ద్రువంపై దించారు. చంద్రుడిపై రోబో దిగిన‌ట్లు కొన్ని నిమిషాల త‌ర్వాత సిగ్న‌ల్ వ‌చ్చింది. ఎటువంటి డౌట్ లేకుండా చెబుతున్నామ‌ని, తాము ప్ర‌యోగించిన ప‌రిక‌రం చంద్రుడి ఉప‌రిత‌లంపై దిగింద‌ని, అది సిగ్న‌ల్స్‌ను ట్రాన్స్‌మిట్ చేస్తున్న‌ట్లు ఫ్ల‌యిట్ డైరెక్ట‌ర్ టిమ్ క్రెయిన్ తెలిపారు. దాదాపు 50 ఏళ్ల త‌ర్వాత అమెరికా వ్యోమ‌నౌక‌  చంద్రుడిపై దిగింది. 1972లో అపోలో స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుడిపై దిగిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా ప్ర‌యోగించిన ఒడిస్సీ రోబోలో ఆరు సైంటిఫిక్ ప‌రిక‌రాల‌ను నాసా ఫిక్స్ చేసింది. అమెరికా మ‌ళ్లీ చంద్రుడిపై వాలిన‌ట్లు ఇన్‌టిట్యూవ్ మెషీన్స్ సంస్థ ఓన‌ర్ తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events