తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని న్యూయార్క్‌లోని టైమ్ స్వేర్‌లో అన్న ఎన్టీఆర్ పేరిట భారీ డిస్ ప్లే కొలువుదీరింది. మే 27 అర్థరాత్రి నుంచి 28 అర్థరాత్రి వరకు 200 అడుగుల ఎత్తు, 36 అడుగుల వెడల్పుతో రూపొందించిన డిస్‌ప్లేను 24 గంటలపాటు ప్రదర్శితమయ్యేలా ఎన్నారై టీడీపీ అమెరికా ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఎన్నారై టీడీపీ నేత జయరాం కోమటి ఆధ్వర్యంలో అమెరికాలోని 28 నగరాల్లో ఉన్న కార్యనిర్వాహక కమిటీ సభ్యులంతా ఈ డిస్‌ప్లే ఏర్పాటుకు సహకారం అందించారు.


అమెరికాలో అత్యంత ఖరీదైన న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్ లో ప్రదర్శించడం గౌరవంగా భావిస్తున్నట్లు ఎన్నారై టీడీపీ నేతలు తెలిపారు.పర్యాటకులు చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ప్రతి 4 నిమిషాలకు ఒకసారి 15 సెకన్ల చొప్పున ఎన్టీఆర్‌కు సంబంధించిన విభిన్న చిత్రాలను ఈ ప్రకటన ద్వారా ప్రసారం చేశారు. ఈ భారీ డిస్‌ప్లే ఏర్పాటుతో ఎన్టీఆర్ అభిమానులు ఆనందోత్సాహాలతో కేరింతలు కొట్టారు. ప్రపంచ పర్యాటకులని, కన్ను తిప్పకుండా చేసింది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలా నుంచి వచ్చిన పర్యాటకులు అన్న ఎన్టీఆర్ డిస్‌ప్లేను ఆసక్తిగా గమనిస్తున్నారని, ఈ ప్రదర్శన వారిని కన్ను తిప్పుకోకుండా చేసిందన్నారు.


