Skip to main content

Namaste NRI

అమెజాన్‌ భారీ విరాళం

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌  ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 20వ తేదీన అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి భారీగా విరాళాలు అందుతున్నాయి.

తాజాగా ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌  ట్రంప్‌ ప్రమాణ స్వీకార నిధికి 1 మిలియన్‌ డాలర్లు విరాళం ఇచ్చేందుకు సిద్ధమైంది. అంతేకాదు కంపెనీ తన ప్రైమ్‌ వీడియో సర్వీస్‌ లో కార్యక్రమాన్ని కూడా ప్రసారం చేయనున్నట్లు అమెజాన్‌ ప్రతినిధి తెలిపారు. ఇందుకోసం అమెజాన్‌ మరో 1 మిలియన్‌ డాలర్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. వచ్చే వారం అమెజాన్‌ వ్యవస్థాపకులు జెఫ్‌ బెజోస్‌ ట్రంప్‌తో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌.. ట్రంప్‌కు 1 మిలియన్‌ డాలర్లు అంటే రూ.8.3 కోట్లు విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే.

Social Share Spread Message

Latest News