అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 7.0గా నమోద యింది. గురువారం ఉదయం 10.44 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ఫెర్న్‌డేల్‌కు నైరుతి దిశగా 100 కిలోమీటర్ల దూరంలో కేప్ మెండోసినో తీరంలో భూమి కంపించింది. పెట్రోలియా, స్కాటియా, కాబ్ తదితర ప్రాంతాల్లోనూ భూకంపం సంభవించినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే (యుఎస్ జి ఎస్) తెలిపింది.
ఉత్తర కాలిఫోర్నియా తీరానికి సమీపంలో భూకంప కేంద్రం 6 కిలోమీటర్ల లోతులో ఉన్నట్టు వెల్లడించింది. అమెరికా పశ్చిమ తీరంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారారు. భూకంప కేంద్రం నుంచి 300 కిలోమీటర్ల తీరం పొడవునా సునామీ వచ్చే అవకాశం ఉందని హోనొలులులోని సునామీ హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. అయితే కాసేపటికి హెచ్చరికలను ఉపసంహరించుకున్నది.