సింగపూర్‌లో ఓ భారతీయ నిర్మాణరంగ కార్మికుడికి అక్కడి కోర్టు భారీ జరిమానా విధించింది. మద్యం మత్తులో తాను ఆ తప్పు చేశానని నిందితుడు అంగీకరించడంతో అతడికి రూ.25 వేల ఫైన్ వేసింది. సింగపూర్‌లో గత ఏడాది అక్టోబర్ 30న రాత్రి రాము అనే భారత పౌరుడు పూటుగా మద్యం సేవించాడు. ఆ రాత్రంతా మెరీనా బే శాండ్స్ కెసినోలో గడిపాడు.
తెల్లవారుజామున 5 గంటలకు కెసినో నుంచి బయటకు వచ్చిన అతను కాలకృత్యాలకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే మద్యం మత్తులో మరుగుదొడ్డి ఎక్కడ ఉందో గుర్తించలేకపోయాడు. చివరకు ఉదయం 7 గంటల సమయంలో అదే ఏరియాలోని ది షాపీస్ అనే స్టోర్ ఎంట్రన్స్ వద్ద మల విసర్జన చేశాడు. దాంతో ఈ ఘటనపై విచారణ జరిపిన సింగపూర్ కోర్టు నిందితుడికి భారీ జరిమానా విధించింది.