అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో డొనాల్డ్ ట్రంప్ దూసుకుపోతున్నారు. దక్షిణ కరోలినా రిపబ్లికన్ ప్రైమరీ లో ఘన విజాయం సాధించారు. ట్రంప్ హవా ధాటికి సొంత రాష్ట్రంలో నిక్కీ హేలీకి ఓటమి తప్పలేదు. ట్రంప్‌కి 63 శాతం ఓట్లు రాగా హేలీకి 36.8 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆయన ఇప్పటికే న్యూ హాంప్ షైర్, నెవడా, ఐయోవా, వర్జిన్ ఐలాండ్స్‌లో విజయం సాధించారు. రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష పదవి అభ్యర్థి త్వానికి పోటీ పడుతున్న భారత సంతతికి చెందిన హేలీ గతంలో రెండుసార్లు సౌత్ కరోలినా గవర్నర్‌గా పనిచేశారు. తన కంచుకోటలోనే ఓడిపోవడంతో, అధ్యక్ష పదవి పోటీకి ట్రంప్ అభ్యర్థిత్వం ఖాయమైపోయిన ట్లేనని ప్రచారం జరుగుతున్నది. నిక్కీ హేలీ పార్టీ అధ్యక్ష పదవి అభ్యర్థిత్వానికి పోటీ నుంచి తప్పుకోవాలని ట్రంప్ వర్గం డిమాండ్ చేస్తున్నది. అయితే తాను రేసు నుంచి తప్పుకునేది లేదని ఆమె ప్రకటించారు. మార్చి 5న జరిగే పలు స్టేట్ ప్రైమరీ ఎన్నికల్లో పోటీలో ఉంటానని స్పష్టం చేశారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)