ఫ్రాన్స్ అధ్యక్షుడిగా రెండోసారి గద్దెనెక్కిన ఇమ్మానుయేల్ మాక్రాన్‌కు పార్లమెంటరీ ఎన్నికల్లో ఆ దేశ ఓటర్లు భారీ షాక్ ఇచ్చారు. 577 స్థానాలు గల పార్లమెంట్‌లో 289 స్పష్టమైన మెజార్టీ కాగా, మాక్రాన్‌కి చెందిన మధ్యేవాద కూటమి 245 స్థానాల్లో గెలుపొంది. జీన్‌లూక్ మెలెన్‌చోన్ నేతృత్వంలోని కొత్త వామపక్ష కూటమి న్యూ పాపులర్ ఎన్విరాన్‌మెంటలిస్ట్ అండ్ సోషల్ యూనియన్ (ఎన్‌యూపీఈఎస్) 131 స్థానాల్లో విజయం సాధించి రెండో స్థానంలో నిలించింది. నేషనల్ ర్యాలీ పార్టీకి 89 స్థానాలు దక్కాయి. తాజా ఫ్రెంచ్ రాజకీయాలను గందరగోళంలో పడేశాయి.
