చైతన్య రావ్, అలెగ్జాండర్ సొల్నికోవ్, ప్రియా పాల్వాయి, ఖ్యాతిలీన్ గౌడ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఎ జర్నీ టూ కాశీ. మునికృష్ణ దర్శకుడు. ఈ చిత్రాన్ని వారణాసి క్రియేషన్స్ పతాకంపై దొరడ్ల బాలాజీ, శ్రీధర్ వారణాసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు ముని కృష్ణ మాట్లాడుతూ రోడ్ జర్నీ చిత్రమిది. ఇందులో కాశీ విశిష్టతను చూపిస్తున్నాం. కాశీ యాత్ర చేసిన వారి జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయనేది ఆసక్తికరంగా తెరకెక్కించాం అన్నారు. హీరో చైతన్య రావు మాట్లాడుతూ ఇది చాలా అరుదైన చిత్రం. మంచి కథతో తెరకెక్కింది. వాస్తవికతకు దగ్గరగా సహజంగా ఉంటుంది. ఇలాంటి సినిమాలో భాగమైనందుకు గర్వపడుతున్నాం అన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 17న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రానికి సంగీతం : ఫణికల్యాణ్, ఛాయాగ్రహణం : గోకుల్ భారతి, శ్రీసాయి.