Skip to main content

Namaste NRI

ఇరాన్ కీల‌క ప్ర‌క‌ట‌న‌!

బాలిస్టిక్‌ క్షిపణుల పరిధిపై విధించుకున్న 2,000 కిలోమీటర్ల స్వీయ పరిమితిని ఎత్తివేసినట్లు ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ కోర్‌ ప్రకటించింది. దాంతో మరింత దూరంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను అభివృద్ధి చేసేదిశగా ఇరాన్ అడుగులు వేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇజ్రాయెల్, అమెరికాల దాడులకు హద్దుల్లేని ప్రతిదాడులు చేద్దామని ఇరాన్‌ సేనలకు సుప్రీంలీడర్‌ మొజ్తబా ఖమేనీ పిలుపునిచ్చారు. ఈ క్ర‌మంలోనే ఇరాన్ తాజా ప్రకటన రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. క్షిపణుల పరిధికి సంబంధించిన పరిమితులు తొలగిపోయాయని, ఈ సామర్థ్యాలను తాము ఆచరణలో ప్రదర్శిస్తామని జనరల్ హొస్సేన్ మొహెబ్బి మీడియా సమావేశంలో వెల్లడించారు.

కాగా, 2,000 కిలోమీటర్లకుపైగా దూరం వెళ్లగల బాలిస్టిక్‌ క్షిపణులు ఇరాన్ వద్ద ఉన్నట్లు అధికారిక సమాచారమేమీ లేదు. ఈ రెండు వేల కిలోమీటర్ల పరిధి కింద మొత్తం అరేబియా ద్వీపకల్పంతోపాటు ఈజిప్టులోని చాలావరకు భూభాగం, గ్రీస్, బాల్కన్‌లోని కొన్ని ప్రాంతాలు వస్తాయి. అయితే ఇరాన్ తన అంతరిక్ష కార్యక్రమానికి సంబంధించిన సాంకేతికతను ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల రూపకల్పనకు ఉపయోగించుకునే అవకాశాలు లేకపోలేద‌ని అమెరికా చెబుతున్న‌ది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events