Namaste NRI

అమెరికా కాంగ్రెస్‌ లో కీలక బిల్లు

మిత్రదేశాలైన జపాన్‌, ఇజ్రాయెల్‌, దక్షిణ కొరియా, నాటో కూటమితో సమానంగా భారత్‌ను చూడాల్సిన అవసరం ఉందని అమెరికా సెనేటర్‌ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు అమెరికన్‌ కాంగ్రెస్‌లో కీలక సభ్యుడు మార్కో రుబియో ఓ బిల్లు ప్రవేశపెట్టారు. భారత్‌తో సైనిక సహకారాన్ని మరింత పెంపొందించుకోవాల్సిన అసవరం ఉందని బిల్లులో పేర్కొన్నారు.భారతదేశ ప్రాదేశిక సమగ్రతకు ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని ఈ బిల్లు గుర్తు చేసింది. భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తేలితే పాకిస్థాన్‌కు భద్రతా సాయాన్ని నిషేధించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. సాంకేతికత బదిలీ, ఆయుధాల సహకారంలో భారత్‌కు అండగా ఉండాల్సిన అవసరం ఉందని బిల్లు ప్రతిపాదిస్తోంది.

ఇండో – పసిఫిక్‌ ప్రాంతంలో చైనా దురాక్రమణ వైఖరిని అనుసరిస్తోందని అమెరికా కాంగ్రెస్‌లో ప్రవేశ పెట్టిన బిల్లు స్పష్టం చేస్తోంది. ఇది ఆ ప్రాంతంలోని అమెరికా భాగస్వామ్య దేశాల సార్వభౌమాధికారాన్ని, స్వయం ప్రతిపత్తికి ఆటంకం కలిగించడానికి ప్రయత్నిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో చైనాను అడ్డుకోవాలంటే భారత్‌తో సత్సంబంధాలు కొనసాగించడం చాలా కీలకమని వెల్లడించింది. అయితే, ఈ బిల్లు చట్టరూపం దాల్చడంపై ఆందోళన నెలకొంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events