Skip to main content

Namaste NRI

కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం

వలసదారుల కట్టడికి కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓ వైపు శాశ్వత నివాస వలసదారుల సంఖ్యను పరిమితం చేస్తూనే, ప్రతిభావంతులకు మరింత ఎక్కువగా ప్రవేశం కల్పించేలా ఇమిగ్రేషన్‌ నిబంధనల్లో మార్పులు చేసింది. పరిశోధకులు, వైద్యులు, పైలట్ల కోసం ఎక్స్‌ప్రెస్‌ ఎంట్రీ సిస్టమ్‌లో కొత్త ప్రాధాన్యత కేటగిరీలు ప్రవేశపెట్టింది. దేశ ఆర్థిక వ్యవస్థ బలపడేందుకు, ఆరోగ్య సంరక్షణ, విమానయానం, రక్షణ రంగాల్లో నిపుణులైన కార్మికుల కొరతను పూడ్చటమే లక్ష్యంగా ఈ నూతన నిబంధనలను రూపొందించినట్టు కెనడా ఫెడరల్‌ ప్రభుత్వం వెల్లడించింది. ఎక్స్‌ప్రెస్‌ ఎంట్రీ అనేది నైపుణ్య కార్మికుల ఇమిగ్రేషన్‌ దరఖాస్తులను పరిశీలించేందుకు ఏర్పాటుచేసిన ఆన్‌లైన్‌ వ్యవస్థ.

Social Share Spread Message

Latest News