Namaste NRI

కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం…రెండేళ్లపాటు నిషేధం

కెనడా ప్రజలను దృష్టిలో పెట్టుకుని అక్కడి ప్రభుత్వం కీలక  నిర్ణయం తీసుకుంది. . జవనరి 1, 2023 నుంచి  విదేశీయులు కెనడా లో ఇళ్లు కొనడానికి వీలు లేకుండా రెండేళ్లపాటు నిషేధిస్తూ ఆ దేశ ప్రధాని జస్టిస్‌ ట్రూడో అధికారిక ప్రకటన చేశారు. కొవిడ్ ప్రభావం మొదలైనప్పటి నుంచి విదేశీయులు సేఫ్టీ పెట్టుబుడులలో భాగంగా రెసిడెన్షియల్ ప్రాపర్టీల   మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీంతో కెనడాలో ఇళ్ల ధరలు భారీగా పెరిగిపోయాయి

దీంతో తమ దేశ పౌరుల ప్రయోజనాలపై కెనడా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో కెనడాలో విదేశీయులు  ఇళ్లు కొనడానికి వీలు లేకుండా రెండేళ్లపాటు నిషేధం విధిస్తూ కొన్ని రోజుల క్రితమే చట్టాన్ని రూపొందించి ఆమోదం తెలిపింది. ఆ చట్టం జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే,  ఇమ్మిగ్రేంట్స్‌కు, కెనడా పౌరసత్వం పొందని పర్మినెంట్ రెసిడెంట్లకు ఈ ఆదేశాల నుంచి మినహాయింపు ఇచ్చింది. ఇలా చేయడం ద్వారా ఇళ్ల ధరలు సామాన్యులకు అందుబాటులోకి వస్తాయనేది కెనడా ప్రభుత్వ ఆలోచన.  ఏడాది దేశ ప్రధాని పదవికి ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే  లిబరల్ పార్టీ ఆఫ్ కెనడా తరుపున ట్రూడో రెండోసారి ప్రధాని పదవి కోసం బరిలోకి దిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కెనడాలో విదేశీయుల ఇళ్ల కొనుగోళ్లను రెండేళ్ల పాటు బ్యాన్ చేస్తామని హామీ ఇచ్చారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events