Namaste NRI

కెన‌డా ప్ర‌భుత్వం  కీలక నిర్ణయం నిర్ణ‌యం

కెన‌డా, చైనా మ‌ధ్య దౌత్య సంబంధాలు బ‌ల‌హీన‌ప‌డ్డాయి. చైనా దౌత్య‌వేత్త‌ ను టొరంటో నుంచి కెన‌డా ప్ర‌భుత్వం వెళ్ల‌గొట్టింది. ఓ పార్ల‌మెంట్ స‌భ్యుడిని బెదిరించిన కేసులో కెన‌డా స‌ర్కార్ కీలక నిర్ణయం నిర్ణ‌యం తీసుకున్న‌ది. చ‌ట్ట‌స‌భ ప్ర‌తినిధి మైఖేల్ చాంగ్‌కు చెందిన స‌మాచారాన్ని చైనా సేక‌రిస్తున్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. చాంగ్‌తో పాటు ఆయ‌న‌కు చెందిన హాంగ్‌కాంగ్ బంధువుల వివ‌రాల‌ను కూడా సేక‌రిస్తున్న‌ట్లు చైనాపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయితే చైనా మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న‌ల‌కు పాల్పడుతోంద‌ని  మైఖేల్ చాంగ్ ఆరోపించారు. ఉలిగ‌ర్ మైనార్టీ జ‌నాభా ప‌ట్ల డ్రాగ‌న్ దేశం విచ‌క్ష‌ణార‌హితంగా ప్ర‌వ‌ర్తిస్తున్న‌ట్లు మైఖేల్ పేర్కొన్నారు.

చైనాకు వ్య‌తిరేకంగా మాట్లాడుతున్నాడ‌న్న ఆరోప‌ణ‌ల‌పై మైఖేల్‌ను డ్రాగ‌న్ దేశం టార్గెట్ చేసింది. దీంతో చైనా దౌత్య‌వేత్త‌ను వెళ్ల‌గొట్టాల్సి వ‌స్తోంద‌ని కెన‌డా పేర్కొన్న‌ది. టొరంటోలో ఉన్న దౌత్య‌వేత్త జావో వీయిను దేశం నుంచి పంపిస్తున్న‌ట్లు కెన‌డా విదేశాంగ శాఖ మంత్రి మెల‌నీ జాలీ తెలిపారు. త‌మ దౌత్య‌వేత్త‌పై వేటు విధించ‌డాన్ని చైనా తీవ్రంగా ఖండించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events