Namaste NRI

అమెరికా ప్రభుత్వ కీలక నిర్ణయం… చిన్నారులకు

కరోనా మహమ్మారిపై పోరాటంలో మలిదశకు అగ్రరాజ్యం అమెరికా ముందడుగేసింది.కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసే క్రమంలో యూఎస్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు టీకాలు అందించేందుకు ఫైజర్‌ టీకాకు ఆమోదం తెలిపింది. అక్కడి అత్యున్నత స్థాయి నిపుణుల బృందం ఇచ్చిన అనుమతి మేరకు ఈ ప్రకటన వెలువడిరది. టీకా  పొందడం వల్ల దుష్ప్రభావాల కంటే ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయని ఆ బృందం స్పష్టం చేసింది. ఫలితంగా 28 మిలియన్ల మంది అమెరికన్‌ చిన్నారులకు టీకా లభించనుంది. తల్లిదండ్రులు, సంరక్షకులు, పాఠశాల సిబ్బంది, చిన్నారులు ఈ అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు.  ఇప్పటికే చైనా, చిలీ, క్యూబా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ చిన్నారులకు టీకా అందిస్తున్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events