Namaste NRI

అమెరికా రాజకీయాల్లో కీలక పరిణామం … ట్రంప్ మెడకు

అమెరికా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకున్నది. మరోసారి అధ్యక్ష బరిలో దిగేందుకు ఉవ్విళ్లూరుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చిక్కుల్లో పడ్డారు. 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో స్ట్రామీ డానియల్స్‌ అనే పోర్న్‌స్టార్‌తో తనకున్న శారీరక సంబంధాన్ని బయటపెట్టకుండా ఉండేందుకు ఆమెకు డబ్బు ఇచ్చి అనైతిక ఒప్పందం చేసుకున్నారని ట్రంప్‌పై ఆరోపణలు రాగా  తాజాగా మన్‌హట్టన్‌ గ్రాండ్‌ జ్యూరీ వాటిని ధ్రువీకరించి అభియోగాలు నమోదుచేసింది. దీంతో ఈ అభియోగాలపై ట్రంప్‌ విచారణ ఎదుర్కొనున్నారు. అగ్రరాజ్య చరిత్రలో నేరాభియోగాలను ఎదుర్కొన్న తొలి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్‌ అపఖ్యాతి మూటకట్టుకున్నారు. అయితే ట్రంప్‌  పై ఏయే నేరాలపై అభియోగాలు మోపారన్నదానిపై స్పష్టత లేదు. ట్రంప్‌ లొంగుబాటుపై మన్‌హట్టన్‌ జిల్లా అటార్నీ, ఆయన న్యాయవాదులతో చర్చలు జరిపారు. ట్రంప్‌ మన్‌హట్టన్‌ కోర్టులో హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.

తాజా పరిమాణంపై ట్రంప్‌ తీవ్రంగా స్పందించారు. కేవలం తనపై రాజకీయ కక్ష సాధింపు, ఎన్నికలలో పోటీకి దిగకుండా ఉండేందుకే ఉన్నత స్థాయి ప్రమేయంతోనే ఈ విధంగా జరిగిందని స్పందించారు. అమెరికా చరిత్రలో ఇంతకు ముందెప్పుడూ ఈ విధంగా జరగలేదని , అధికారంలో ఉన్న డెమోక్రాట్లు చివరికి దేశంలోని న్యాయ వ్యవస్థను కూడా లోబర్చుకుని ప్రత్యర్థులపై ఆయుధంగా వాడుకుంటున్నారని విమర్శించారు. మాన్‌హట్టన్ జిల్లా జడ్జిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యక్తి ఆ స్థానంలో కూర్చుని ఈ విధంగా జోబైడెన్ డర్టీగేమ్‌ను సాగించే బాధ్యతలు తీసుకున్నట్లుగా ఉందన్నారు. డెమోక్రాట్లు అబద్థాలకోర్లు, మోసగాళ్లు, ఏదో విధంగా ట్రంప్‌ను దెబ్బతీయాలనేదే వారి ఆలోచన అని విమర్శించారు . ఇప్పుడు ట్రంప్‌పైవ విచారణ జరిగి అభియోగాలు రుజువు అయితే ఆయనకు నాలుగేళ్ల జైలు పడే వీలుంటుంది. లేకపోతే కేవలం జరిమానాతో సరిపెడుతారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events