Skip to main content

Namaste NRI

భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందంలో కీలక పరిణామం

అమెరికాతో ఎంతోకాలంగా వాయిదా పడుతూ వస్తున్న వాణిజ్య ఒప్పందంపై కీలకమైన ముందడుగు పడింది. వాణిజ్య ఒప్పందానికి ఇరు దేశాలు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. భారత ప్రధాని మోదీతో ఫోన్‌ సంభాషణ తర్వాత ఒప్పందం ఖరారైనట్టు ట్రంప్‌ ప్రకటించారు. ఇందులో భాగంగా భారత్‌పై ప్రతీకార సుంకాలను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్టు తెలిపారు. అంతేగాకుండా రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్‌ నిలిపివేస్తుందని చెప్పారు. అలాగే అమెరికాపై సుంకాలను సున్నాకు తగ్గించబోతున్నదని ప్రకటించారు.

వాణిజ్య ఒప్పందానికి భారత్‌-అమెరికా అంగీకరించాయని, దీంతో భారత్‌పై తాను విధించిన ప్రతీకార సుంకాలను 25 నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్టు ట్రంప్‌ ప్రకటించారు. తన ఈ చర్య స్నేహం, గౌరవానికి చిహ్నంగా ట్రంప్‌ పేర్కొన్నారు. అమెరికాపై విధిస్తున్న సుంకాలను పూర్తిగా ఎత్తివేసేందుకు భారత్‌ ముందుకొస్తుంది.సుమారు 500 బిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ విలువైన ఇంధన, సాంకేతిక, వ్యవసాయ, బొగ్గు, ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేస్తామని మోదీ హామీ ఇచ్చారు అని ట్రంప్‌ పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News