యుద్ధంలో ఉక్రెయిన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్న తరుణంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన చిరకాల మిత్రుడు కిమ్ జోంగ్ ఉన్ సాయం కోరుతున్నారు. ఉక్రెయిన్పై దండయాత్ర చేస్తున్నందుకు పశ్చిమ దేశాలు తమపై ఆంక్షాలు విధించిన నేపథ్యంలో ఉత్తర కొరియా నుంచి ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్నారు. ఉత్తర కొరియా నుంచి రష్యా దిగుమతి చేసుకుంటున్న ఆయుధాల్లో ఆర్టిలరీ షెల్స్, రాకెట్స్, వంటివి ఉన్నట్లు తెలిసింది. అయితే ఎన్ని ఆయుధాలను రష్యా దిగుమతి చేసుకుందనే విషయాన్ని మాత్రం అమెరికా నిఘావర్గాలు వెల్లడిరచలేదు. ఆంక్షలు ఉన్నంత కాలం ఉత్తర కొరియా నుంచి రష్యా మరిన్ని ఆయుధాలు కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)