భారత సంతతికి చెందిన కె.ధనలక్ష్మి సింగపూర్లో అతిపెద్ద కార్మిక సంస్థ అయిన జాతీయ కార్మిక సంఘాల సమాఖ్య (ఎన్టీయూసీ) అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. 450 మంది ప్రతినిధులు ఆమెను నాలుగేళ్ల అధ్యక్ష పదవికి ఎన్నుకున్నారు. ఈమె 2016-18లో సింగపూర్ పార్లమెంటులో నామినేటెడ్ సభ్యురాలిగా ఉన్నారు.