అమెరికాలో భారత సంతతికి చెందిన మహిళా వ్యాపారవేత్త, సిక్కు కమ్యూనిటీ నాయకురాలు రాజీ బ్రార్‌కు కీలక పదవి దక్కింది. కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యురాలిగా రాజీ బ్రార్ నియమితులయ్యారు. మే నుంచి ఆమె అధికారికంగా తన బాధ్యతలు నిర్వహించనున్నారు. కెర్న్ కౌంటీలో ప్రముఖ వ్యాపావేత్త అయిన బ్రార్ అక్కడి సిక్కు వర్గానికి నేతృత్వం వహిస్తున్నారు. కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీలో ఆమె చదువుకున్నారు. బోర్డుకు ఎంపికవడంపై బ్రార్ హర్షం వ్యక్తం చేశారు. కాలిఫోర్నియా స్టే్ట్ యూనివర్సిటీ ఎంతో ప్రత్యేకమైనదని, ఇక్కడి విద్యార్థులకు మంచి మార్గనిర్దేశకత్వం మరెక్కడా దొరకదని వ్యాఖ్యానించారు.

కెర్న్ కౌంటీలోపలు కీలక నాయకత్వ స్థానాల్లో బ్రార్ సేవలందించారు. బేకర్స్ ఫీల్డ్ సిక్కు వుమ్స్ అసోసియేషన్ వ్యవస్థాపకుల్లో ఆమె కూడా ఒకరు. బయాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ పట్టా పొందిన ఆమె కాలిఫోర్నియా యూనివర్సిటీలో హెల్త్ కేర్ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. యూనివర్సిటీ ఆలమ్నీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో కూడా చోటుదక్కించుకున్నారు.

1970ల్లో ఆమె తల్లిదండ్రులు పంజాబ్ నుంచి అమెరికాకు వలస వెళ్లారు. ఆడపిల్లకు చదువు అనవసరమనే భావన కారణంగా తన తల్లి ఐదో తరగతి వరకే చదువుకుందని, ఆమెకు చదవడం రాయడం రాదని బ్రార్ చెప్పుకొచ్చారు. తనను ఉన్నత చదువులు చదవాలంటూ తల్లే ప్రోత్సహించిందని చెప్పుకొచ్చారు. కమ్యూనిటీ లీడర్‌గా అనేక బోర్డు, కమిటీలలో పనిచేసిన రాజీ బ్రార్‌ను ఎన్నో అవార్డులు వరించాయి. బేకర్స్ ఫీల్డ్ సిక్కు మహిళా సంఘం తరపున యువతీ, యువకులకు స్కాలర్‌షిప్ అందించే కార్యక్రమం వెనుక రాజీ బ్రార్ ఎంతో కృషి చేశారు.















