ప్రపంచంలోనే అతిపెద్ద లా సంస్థగా గుర్తింపు పొందిన డెంటన్స్ లో మానవ వనరుల విభాగానికి అధిపతిగా నీలిమ పాలడుగు నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖకు చెందిన నీలిమ పాలడుగు ప్రస్తుతం అమెరికాలోని డెల్లాయిట్ కంపెనీలో గ్లోబల్ పీపుల్స్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఒక భారతీయురాలికి ఈ తరహా కంపెనీలో గ్లోబల్ చీఫ్ పీపుల్స్ ఆఫీసర్‌గా పదవి దక్కడం ఇదే తొలిసారి. 250కి పైగా దేశాలలో విస్తరించిన డెంటన్స్‌లో నవంబర్ 15న నీలిమ చేరనున్నారు. డెంటన్స్‌లో 12 వేల మంది వరకు న్యాయవాదులు ఉంటారు. ఇందులో దాదాపు 20 వేల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.














