అగ్రరాజ్యం అమెరికాలో మరో భారతీయుడికి అరుదైన గౌరవం దక్కింది. భారత్కు చెందిన డాక్టర్ వాసన్ న్యూయార్క్లో ఎపిడెమాలజిస్ట్గా పని చేస్తున్నారు. అశ్విన్ వాసన్ను డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ మెంటల్ హైజీన్ (డీఓహెచ్ఎమ్హెచ్) కమిషనర్గా నియమిస్తూ న్యూయార్క్ సిటీ మేయర్ ఎలెక్ట్ ఎరిక్ ఆడమ్స్ ప్రకటించారు. ప్రస్తుతం డీఓహెచ్ఎమ్హెచ్ కమిషనర్గా డాక్టర్ డేవ్ ఏ చోక్సీ పని చేస్తుండగా ఆయన పదవికాలం మరో మూడు నెలల్లో ముగియనుంది. అనంతరం డాక్టర్ అశ్విన్ వాసన్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరిస్తారు.