సౌదీ అరేబియా కీలక ప్రకటన చేసింది. రీ ఎంట్రీ, ఎగ్జిట్ వీసాలపై ఎవరైతే క్యాన్సిల్ చేసుకుంటారో వారికి వాటి తాలూకు ఫీజులను రిఫండ్ చేయడం జరగదని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్స్ వెల్లడిరచింది. అలాగే లబ్ధిదారుడు ఈ వీసాలను సవరించుకోవడానికి కూడా వీలు పడదని స్పష్టం చేసింది. కానీ, యజమాని అబ్షర్ ప్లాట్ ఫారమ్ ద్వారా మాత్రమే రద్దు చేసుకునే అవకాశం ఉందని జవాజత్ పేర్కొంది. అయితే, ఎట్టిపరిస్థితుల్లో రీ` ఎంట్రీ, ఎగ్జిట్ వీసాల రుసుము మాత్రం రిఫండ్ చేయడం ఉండదని తేల్చి చెప్పింది. ఇక ప్రొబేషనరీ పీరియడ్‌లో ఉన్న కార్మికుల ఫైనల్ ఎగ్జిట్ వీసాలు కూడా క్యాన్సిల్ చేయడం కూదరదని స్పష్టం చేశారు. అలాగే విజిట్ వీసాలను రెసిడెన్సీ పర్మిట్లుగా (ఇఖామా) మార్చడం సాధ్యపడదని తెలిపింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/telusukada-300x160.jpg)