సౌదీ అరేబియా వెళ్లేవారికి శుభవార్త. కరోనా కట్టడికోసం విధించిన అన్ని ఆంక్షలను తొలగిస్తున్నట్లు సౌదీ అరేబియా వెల్లడిరచింది. కొవిడ్ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు సౌదీ అరేబియా అధికారులు కీలక ప్రకటన చేశారు. తాజాగా ఎత్తివేసిన చర్యలలో గ్రాండ్ మసీదు, ప్రొఫెట్ మసీదు మినహా మూసీ ఉన్న ప్రదేశాలలో ఫేస్‌మాస్క్‌లు ధరించాల్సిన అవసరం లేదు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి సంబంధించిన ముందుస్తు జాగ్త్రలు, నివారణ చర్యలను ఎత్తివేయాలని నిర్ణయించినట్లు సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రజా రవాణా అధికారులు ప్రజల రక్షణ కోసం చర్యలు తీసుకోవచ్చు. సౌకర్యాలు, కార్యకలాపాలు, ఈవెంట్‌లు, విమాన బోర్డింగులు, ప్రజా రవాణాలో ప్రవేశించడానికి తవాకుల్నా అప్లికేషన్‌లో టీకాలు తీసుకోవడం, ఆరోగ్య ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు. బూస్టర్ డోస్ తీసుకోవాల్సిన వ్యవధి రెండో డోస్ తీసుకున్న మూడు నెలలకు బదులుగా ఎనిమిది నెలల వరకు తీసుకోవచ్చని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడిరచింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/40ae94df-5916-473f-9c15-eadaf1b15c93-179x300.jpg)