అమెరికాలో వ్యాక్సినేషన్‌పై శ్వేతసౌధం తాజాగా కీలక ప్రకటన చేసింది. అమెరికాలో జనాభాలో 50 శాతం మంది ప్రజలు పూర్తి స్థాయిలో కొవిడ్ టీకా తీసుకున్నారని వెల్లడిరచింది. అగ్రరాజ్యం అమెరికాను డెల్టా వేరియంట్ వణికిస్తోంది. డెల్టా వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆ దేశంలో కరోనా బారినపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రతి రోజు సగటున లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కొవిడ్ టీకాను తీసుకోవాల్సిందిగా ప్రజలకు అమెరికా ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలించడంతో పూర్తి స్థాయిలో టీకా పొందిన వారి సంఖ్య 50 శాతానికి చేరింది. ఈ విషయాన్ని వైట్‌హౌస్ ప్రకటించింది. 50 శాతం మంది అమెరికన్లు (అన్ని వయసుల వాళ్లు) పూర్తి స్థాయిలో కరోనా వ్యాక్సిన్ పొందారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రస్తుతం అమెరికాలో 165 మిలియన్ల మంది కంటే ఎక్కువ ప్రజలు టీకా రెండు డోసులను పొందారన్నమాట.