Namaste NRI

పాత‌బ‌స్తీలో పతంగ్ పాట వదిలారు

పతంగుల పోటీ నేపథ్యంలో రానున్న కామెడీ స్పోర్ట్స్‌ డ్రామా చిత్రం పతంగ్‌. ప్రీతి పగడాల, ప్రణవ్‌ కౌశిక్‌, వంశీ పూజిత్‌ ఇందులో ముఖ్య తారలు. ప్రణీత్‌ ప్రత్తిపాటి దర్శకుడు. విజయ్‌ శేఖర్‌ అన్నే, సంపత్‌ మక, సురేశ్‌ కొత్తింటి నిర్మాతలు. ప్రముఖ గాయకుడు ఎస్పీ చరణ్‌ ఇందులో ప్రత్యేక పాత్ర పోషించడం విశేషం. ఈ సందర్భంగా ఇందులోని హే హలో నమస్తే అంటూ సాగే ఓ లిరికల్‌ సాంగ్‌ని హైదరాబాద్‌ పాతబస్తీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వినూత్నంగా గేయరచయిత చంద్రబోస్‌, దర్శకుడు అనుదీప్‌ కేవీలు విడుదల చేశారు. ఈ సందర్భంగా యూనిట్‌కు సభ్యులకు అతిథులిద్దరూ శుభాకాంక్షలు అందించారు. సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉన్న తాను ఈ పాట నచ్చి, సినిమా నిర్మాణానికి పూనుకున్నానని నిర్మాతల్లో ఒకరైన సంపత్‌ మక తెలిపారు. ఇంకా చిత్ర యూనిట్‌ సభ్యులందరూ మాట్లాడారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వేసవిలో విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events