ఓ మెరుపు ప్రపంచ రికార్డు అయి మెరిసింది. 2020 ఏప్రిల్ 29న అమెరికా కనిపించిన ఇదే ఇంతవరకు అతి పొడవైనదిగా ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) తేల్చింది.అమెరికా రాష్ట్రం అంతటా దాదాపు 769 కిమీ. దూరం వరకు విస్తరించి రికార్డు సృష్టించింది. ఇదే అత్యధిక సింగిల్ ప్లాష్‌గా ప్రకటిచింది. దీని దూరం లండన్ నుంచి జర్మనీలోని హాంబర్గ్ నగరం వరకు విస్తరించిన దూరం ఉటుందని పేర్కొంది. ఈ మెరుపు అమెరికాలోని మిసిసిపి, లుసియానా మొదలుకుని దక్షిణాన ఉన్న టెక్సాస్ వరకు విస్తరించినట్లు నమోదు చేశారు. దాని పొడవు వాస్తవంలో 768 కిమీ. లేక 477.2 మైళ్లుగా నమోదయింది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి ఇంటర్‌గవర్నమెంటల్ సంస్థ తెలిపింది. ప్రకృతి శక్తి సామర్థ్యాలకు ఇవి కొలమానంగా చెప్పారు. మెరుపుల పొడవు, వ్యవధిని గుర్తించడానికి ఉపయోగించే సాంకేతికత ఇటీవల కాలంలో చాలా మెరుగుపడినట్లు తెలిపారు. ఈ మేరకు ఇంకా ఎక్కువ తీవ్రత గల వాటిని గుర్తించే అవకాశం ఉందని తెలిపారు.














