భారత సంతతి బ్రిటన్ పౌరుడు, మీడియా ప్రముఖుడు డాక్టర్ సమీర్ షా బీబీసీ చైర్మన్‌గాఎంపికయ్యారు. ఈ మేరకు బ్రిటన్ సాంస్కృతిక కార్యదర్శి లూసీ ఫ్రేజర్ ఛైర్మన్‌గా ఆయన నియామకాన్ని అధికారికంగా ధృవీక రించారు. హౌస్ ఆఫ్ కామన్స్ ఎంపీలతో కూడిన ఎంపిక కమిటీ ఆయన పేరును ఖరారు చేయగా, దీనికి బ్రిటన్ రాజు చార్లెస్-3 ఆమోదముద్ర వేయనున్నారు. టీవీ ప్రొడక్షన్, జర్నలిజంలో 40ఏండ్లకుపైగా అనుభవం కలిగి న సమీర్ షా గతంలో బీబీసీ కరెంట్ అఫైర్స్, పొలిటికల్ ప్రోగ్రామ్స్ హెడ్‌గా పనిచేశారు. బీబీసీ చైర్మన్‌గా ఆయన 2028 మార్చి వరకు కొనసాగుతారు. ఏడాదికి రూ.1.6 కోట్లు వేతనంగా సమీర్ షా అందుకోనున్నారు. బీబీసీ సమాచార పంపిణీ, జర్నలిస్టుల నియామకాలు పాలనా వ్యవస్థ వంటివాటికి ఆయన ప్రధాన అనుసంధానకర్తగా ఉంటారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)