ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నగరంలో తెలుగు ప్రవాస భారతీయులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.I am with CBN, We Stand with CBN, Save Democracy – Save AP అనే నినాదాలతో నగరంలో నిత్యం రద్దీగా ఉండే ప్రధాన వీధులలో దాదాపు మూడు గంటల పాటు ప్రదర్శన చేశారు. పేద యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్య శిక్షణ ఇప్పించడమే చంద్రబాబు చేసిన నేరమా అంటూ పలువురు ప్రశ్నించారు.ప్రజలలో ప్రతిపక్షాలకు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక వైకాపా ప్రభుత్వం చంద్రబాబు మీద అక్రమంగా కేసులు పెట్టినట్లుగా ర్యాలీలో పాల్గొన్న కొందరు అభిప్రాయం వెలిబుచ్చారు. భారతదేశానికి సంబంధించిన ఒక రాజకీయ నాయకుడకి మద్దతుగా జర్మనీ దేశంలో ఇలా నిరసన ర్యాలీ చేయడం ఇదే ప్రప్రధమని నిర్వాహకులు తెలిపారు.