Skip to main content

Namaste NRI

ఆషికా రంగనాథ్‌కు మెగా ఛాన్స్‌

కన్నడ భామ ఆషికా రంగనాథ్‌ బంపరాఫర్‌ను సొంతం చేసుకుంది. చిరంజీవి కథానాయకుడిగా వశిష్ట దర్శకత్వంలో రూపొందిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభర లో ఆషికా రంగనాథ్‌ కీలక పాత్రలో నటించనుంది. ఈ విషయాన్ని మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. మూడో సినిమాలోనే మెగాస్టార్‌తో కలిసి తెరను పంచుకోవడం అదృష్టమని ఆమె అభిమానులు భావిస్తున్నారు.

విశ్వంభర చిత్రంలో చిరంజీవి సరసన త్రిష కథానాయికగా నటిస్తున్నది. ఈ సినిమాలో ఐదుగురు నాయిక లకు చోటుందని వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పంచభూతాల నేపథ్యంలో ఆధ్యాత్మిక, ఫాంటసీ అంశాల కలబోతగా విజువల్‌ ఫీస్ట్‌లా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తు న్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 10న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె నాయుడు, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, నిర్మాణ సంస్థ: యు.వి.క్రియేషన్స్‌, నిర్మాతలు: విక్రమ్‌, వంశీ, ప్రమోద్‌, రచన-దర్శకత్వం: వశిష్ట.

Social Share Spread Message

Latest News