సూపర్‌స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయమవుతున్న చిత్రం శ్రీనివాస మంగాపురం. రాషా తడాని కథానాయిక. అజయ్‌భూపతి దర్శకత్వం ఈ చిత్రాన్ని అశ్వనీదత్ సమర్పణలో పి.కిరణ్ నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. ఈ సినిమా నుంచి రావే చెలియా అనే పాటను విడుదల చేశారు.

జీవీ ప్రకాష్‌కుమార్ స్వరపరచిన ఈ పాటకు నాగార్జున రెడ్డి సాహిత్యాన్నందించారు. కపిల్ కపిలన్ ఆలపించారు. ప్రేమికుల జీవితాల్లో ఎడబాటు మిగిల్చిన ఆవేదనను వ్యక్తం చేస్తూ ఈ పాట సాగింది. విజువల్స్ పాటలోని ఉద్వేగాల్ని మరింత ఎలివేట్ చేసేలా ఉన్నాయి.ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలో సీనియర్ నటుడు మోహన్‌బాబు కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్.





























