Skip to main content

Namaste NRI

ప్రేమికుల రోజుకి తగ్గ సినిమా

సంతోష్‌ శోభన్‌, మానస వారణాసి జంటగా నటించిన చిత్రం కపుల్‌  ఫ్రెండ్లీ. అశ్విన్‌ చంద్రశేఖర్‌ దర్శకత్వం. ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్‌ సంస్థ నిర్మించింది. నిర్మాత ధీరజ్‌ మొగిలినేని తెలుగు రాష్ర్టాల్లో విడుదల చేస్తున్నారు. మ్యూజికల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు.

ఈ వేడుకకు హీరో శ్రీవిష్ణు, దర్శకుడు అనిల్‌ రావిపూడి అతిథులుగా హాజరయ్యారు. అందమైన ప్రేమకథా చిత్రమిదని, హృదయాన్ని స్పృశించే భావోద్వేగాలతో పాటు చక్కటి హాస్యంతో సాగుతుందని హీరో సంతోష్‌శోభన్‌ తెలిపారు. ఫీల్‌గుడ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామని, ప్రేమికుల రోజున పర్‌ఫెక్ట్‌ మూవీ ఇదని దర్శకుడు అన్నారు.

Social Share Spread Message

Latest News