వికాష్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ముఖచిత్రం. విశ్వక్సేన్ కీలక పాత్రను పోషించారు. గంగాధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల నిర్మించారు. ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రియా వడ్లమాని మీడియాతో మాట్లాడుతూ నటనతో కట్టిపడేసే ఓ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నామన్నారు. ఇప్పటి వరకు ఐదు సినిమాల్లో నటించా. కథానాయికగానే కాకుండా, నటిగా నన్ను మరో స్థాయికి తీసుకెళ్లే చిత్రం అవుతుంది అన్నారు. అయేషాఖన్ మాట్లాడుతూ జీవితంలో ఎలా ఉండాలో పూర్తి స్పష్టత ఉన్న అమ్మాయిగా, తను అనుకున్నది చేసే అమ్మాయిగా నేను కనిపిస్తా. నా అదృష్టం సినిమాలో ప్రమాద సన్నివేశాలు ఉంటాయి. వాటిని చేసేటప్పుడు నేను కూడా గాయపడ్డాను. రెండు నెలల విరామం తీసకుని చిత్రీకరణలో పాల్గొన్నా. కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుందనే నమ్మకం నాకుంది అన్నారు.














