కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం కె-ర్యాంప్. జైన్స్ నాని దర్శకత్వం. ఈ చిత్రాన్ని రాజేష్ దండ, శివ బొమ్మకు నిర్మించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ ఓ వైబ్ క్రియేట్ చేయాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా చేశాం. ఈ సినిమాలో నేను జాలీగా లైఫ్‌ను గడిపే బాగా డబ్బున్న యువకుడు కుమార్ పాత్రలో కనిపిస్తా. ఈ సినిమా ప్రతీ ఒక్కరికి కాలేజీ రోజుల్ని గుర్తుకుతెస్తుంది అన్నారు.

దీపావళికి కుటుంబమంతా కలిసి చూసే చిత్రమిదని, నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, వెంకీ, రెడీ తరహాలో మళ్లీ మళ్లీ చూసేలా ఉంటుందని చెప్పారు. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగే చిత్రమిదని, కె-ర్యాంప్ అంటే కిరణ్ అబ్బవరం ర్యాంప్ అని దర్శకుడు తెలిపారు. ఈ కథవిని బాగా నవ్వుకున్నానని, ఈ దీపావళికి ఎంత పోటీ ఉన్నా సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నామని నిర్మాత రాజేష్ దండా తెలిపారు. దీపావళి పర్వదినం సందర్భంగా అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకురానుంది.
















