Skip to main content

Namaste NRI

డాక్టర్ అరుళనందు పుట్టినరోజు సందర్భంగా హైకు ఫస్ట్ లుక్ విడుదల

ఏగన్‌, కోర్ట్‌ శ్రీదేవి, మిన్నల్‌ మురళి ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న పానిండియా రొమాంటిక్‌ డ్రామా హైకు. యువరాజ్‌ చిన్నసామి దర్శకుడు. డా.అరుళనందు, మాథ్యో అరుళనందు నిర్మాతలు. నిర్మాతల్లో ఒకరైన డా.అరుళనందు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. ఇదొక రొమాంటిక్‌ డ్రామా అని ఈ పోస్టర్‌ని చూస్తే తెలుస్తున్నది. రంగురంగుల కుర్చీలతో ఖాళీగా ఉన్న ఓ గ్యాలరీలో కూర్చున్న హీరోహీరోయిన్లని ఈ పోస్టర్‌లో చూడొచ్చు.

యువతీయువకుల్లోని అమాయకత్వం, ప్రేమ, విద్యార్థి జీవితంలో వారు కనే కలలు, వీటన్నింటి మేళవింపుగా ఈ సినిమా ఉంటుందని మేకర్స్‌ చెబుతున్నారు. ఈ పోస్టర్‌లో కనిపిస్తున్న లవ్‌సింబల్‌ హీరోహీరోయిన్ల కెమిస్ట్రీకి అద్దం పడుతున్నది. త్వరలో విడుదల కానున్న ఈ పానిండియా చిత్రానికి కెమెరా: ప్రియేష్‌ గురుసామి, సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌, కథనం: హరిహరన్‌ రామ్‌, యువరాజ్‌ చిన్నసామి, నిర్మాణం: విజన్‌ సినిమా హౌస్‌.

Social Share Spread Message

Latest News