Namaste NRI

ఇండోనేషియాలో కొత్త చట్టం

వివాహేతర సంబంధాలు, పెళ్లికి ముందు శృంగారంతో పాటు స్త్రీ, పురుషుల సహ జీవనాన్ని నిషేధించేందుకు ఇండోనేషియా ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ క్రిమినల్‌ కోడ్‌ను ఇండోనేషియా పార్లమెంటు సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రభుత్వ సిద్ధాంతాలు, విలువలకు వ్యతిరేకంగా దేశాధ్యక్షుడు లేదా సంస్థలను కించపరిచే వ్యాఖ్యలపైనా ఆంక్షలు విధించింది. ఇప్పటికే అమలులో ఉన్న దైవ దూషణ నిబంధనలకు కొత్త చట్టంతో మరింత  విస్తరణ లభించింది.  ఇండోనేసియాలో గుర్తింపు పొందిన ఇస్లాం, హిందూయిజం, బుద్ధిజం సహా ఆరు మతాల మూల సిద్దాంతాల నుంచి ఎవరైనా వైదొలగితే అయిదేళ్ల జైలు శిక్ష విధిస్తారు. కొత్త చట్టాన్ని తీసుకువచ్చిన సందర్భంగా పలువురు నిరనకారులు పార్లమెంట్‌ వద్ద ప్రదర్శన నిర్వహించిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events