భారతీయ పౌరాణిక ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్. ప్రభాస్ రాముడి పాత్రలో టైటిల్ రోల్‌ను పోషిస్తుండగా, కృతిసనన్ సీత పాత్రలో కనిపించనుంది. ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. భూషణ్‌కుమార్ నిర్మించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ధ్యాన ముద్రలో ఉన్న హనుమాన్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. దీనికి రామ భక్తుడు, రాముడి ఆత్మ..జై పవనపుత్ర హనుమాన్ అనే క్యాప్షన్‌ను జోడించారు. ఈ సినిమాలో హనుమంతుడి పాత్రలో దేవదత్ నాగే నటించారు. ఇటీవలే శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామ లక్ష్మణుడి పోస్టర్‌ను విడుదల చేశారు. త్రీడీ గ్రాఫిక్స్ హంగులతో భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడి పాత్ర పోషించాడు. ఈ సినిమాను జూన్ 16న ఇండియాతో పాటు పలు దేశాల్లో విడుదల కానుంది.
![](https://namastenri.net/wp-content/uploads/2023/04/9f49e8d2-8280-46f1-9cd4-82d86a88c854-49-10.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/04/4b3127df-f30c-4f25-9c19-7ecfdbd57b90-51-10.jpg)