టాలీవుడ్ యాక్టర్ సిద్దు జొన్నలగడ్డ టైటిల్ రోల్‌లో నటిస్తున్న సీక్వెల్ ప్రాజెక్ట్ టిల్లు 2. మల్లిక్‌రామ్ దర్శకత్వం. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథనాయికగా నటిస్తోంది. ఈ మూవీని సితార ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫన్ ట్రాక్ వీడియోతోపాటు ఫస్ట్ సింగిల్ టికెటే కొనకుండా పాటకు మంచి స్పందన వస్తోంది. ఇదిలా ఉంటే న్యూ ఇయర్ కానుకగా ఈ మూవీ నుంచి కొత్త పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌లో బెడ్‌పై టిల్లు ఉండగా.. తన ఒడి లో కూర్చొని అనుపమ ఇచ్చే లుక్ అభిమానులు మతి పోగొడుతుంది. ఇక ఈ లుక్‌లో అనుపమ టూ హాట్‌గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.