అమెరికా నావికా దళం మాజీ డైవర్, బయోమెడికల్ ఇంజినీరింగ్ స్పెషలిస్ట్ జో డిటూరీ నీటి అడుగున 100 రోజులు నివసించి సరికొత్త రికార్డు సృష్టించారు. గతంలో నమోదైన 74 రోజుల రికార్డును చెరిపేశారు. సముద్ర పు నీటి అడుగున ఎక్కువ కాలం నివసించవచ్చునని ఆయన నిరూపించారు. సముద్రంలో 100 రోజులపాటు నివసించిన అనుభవం తన జీవితాన్ని మార్చిందని ఆయన తెలిపారు. కొత్త విషయాలను తెలుసుకోవడం ఎల్లప్పుడూ వ్యక్తిగతంగా, వృత్తిపరంగా మంచి ఫలితాలను ఇస్తుందన్నారు. అన్ని హద్దులను చెరిపేసే విధంగా నూతన తరం పరిశోధకులకు తాను ప్రేరణగా నిలుస్తానని ఆశిస్తున్నట్లు చెప్పారు.