
ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం కొత్త మలుపు. భైరవి ఆర్థ్యా కథానాయిక. శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకుడు. తాటి బాలకృష్ణ నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. గ్రామీణ వాతావరణంలో సాగే ఈ రొమాంటిక్ ప్రేమకథలో సస్పెన్స్‌తోపాటు వినోదం కూడా ఉంటుందని, ఆకాష్, భైరవి బావామరదళ్లుగా నటించారని, త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామని దర్శకుడు తెలిపారు. రఘు బాబు, పధ్వీ, ప్రభావతి, మహేందర్, డీడీ శ్రీనివాస్, కిట్టయ్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకత్వం: శివ వరప్రసాద్ కేశనకుర్తి, నిర్మాత: తాటి బాలకష్ణ,సహ నిర్మాత: తాటి భాస్కర్, సంగీతం: యశ్వంత్.















