వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా మాస్టర్ కార్డ్ మాజీ సీఈవో, భారత సంతతికి చెందిన అజయ్ బంగా నియామకం కానున్నారు. ఈ మేరకు వరల్డ్ బ్యాంక్ ధృవీకరించింది. వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ పోస్టుకు అజయ్ బంగా నామినేట్ అయ్యారు. ఆయన అభ్యర్థిత్వాన్ని బోర్డు సభ్యులందరూ ఆమోదించిన అనంతరం వరల్డ్ బ్యాంక్ ఒక ప్రకటన చేసింది. అజయ్ బంగా వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా ఈ ఏడాది జూన్ 2వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ పదవిలో ఆయన ఐదేండ్ల పాటు కొనసాగుతారని వెల్లడించింది. బంగా ప్రస్తుతం జనరల్ అట్లాంటిక్‌లో వైస్ ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి మరియు ప్రపంచ బ్యాంకు అనే రెండు అగ్రశ్రేణి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలకు అధిపతి అయిన మొట్టమొదటి భారతీయ-అమెరికన్, సిక్కు-అమెరికన్ బంగా.

















