ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి భారత సంతతికి చెందిన బిజినెస్ లీడర్ అజయ్ బంగా ఎన్నికకు మార్గం సుగమమైంది. ఈ పదవికి నామినేషన్ గడువు ముగియడం, ఈ పదవికి ఏ దేశమూ మరో వ్యక్తిని ప్రతిపాదించకపోవడంతో బంగా ఎంపిక లాంఛనం కానుంది. మాస్టర్ కార్డు ఐఎన్‌సీ చీఫ్‌గా పనిచేసిన బంగా ప్రస్తుతం జనరల్ అట్లాంటిక్ వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. పుణేలో జన్మించి అహ్మదాబాద్ ఐఐఎంలో చదివిన బంగా 2016లో పద్మశ్రీ అందుకున్నారు. ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి ఆయన పేరును అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫిబ్రవరిలో ప్రతిపాదించారు.