Namaste NRI

ఆధ్యాత్మిక పరవశాన్ని ఇచ్చిన టిఎల్‌సిఎ తీర్థయాత్ర

న్యూయార్క్‌లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (టిఎల్‌సిఎ) అమెరికాలో మొదటిసారిగా ఆధ్యాత్మిక స్థల సందర్శనం పేరుతో నిర్వహించిన కార్యక్రమం ఘనంగా జరిగింది. సెప్టెంబర్‌ 10వ తేదీన నిర్వహించిన ఆధ్యాత్మిక స్థల సందర్శనం కార్యక్రమంలో భాగంగా 4 దేవాలయాలను టిఎల్‌సిఎ నాయకులు, సభ్యులు సందర్శించి పూజలను చేశారు. ఈ కార్యక్రమాన్ని టిఎల్‌సిఎ అధ్యక్షుడు నెహ్రు కఠారు, మాజీ అధ్యక్షుడు ఉదయ్‌ దొమ్మరాజు నిర్వహించారు.


న్యూజెర్సిలోని గురువాయూరప్పన్‌ టెంపుల్‌, శ్రీ స్వామినారాయణ టెంపుల్‌, సాయిదత్త పీఠం, ఫిలడెల్ఫియా లోని శృంగేరి విద్యాభారతి ఫౌండేషన్‌ను సందర్శించుకుని పూజలను నిర్వహించారు.


ఈ కార్యక్రమంలో టిఎల్‌సిఎ అధ్యక్షుడు నెహ్రు కఠారు, మాజీ అధ్యక్షుడు ఉదయ్‌ దొమ్మరాజు, బిఓటి చైర్మన్‌ అంకినీడు ప్రసాద్‌, రాఘవరావు పోలవరపు (మాజీ బోర్డ్‌ చైర్మన్‌), వెంకటేశ్‌ ముత్యాల (మాజీ బోర్డ్‌ చైర్మన్‌), మాజీ అధ్యక్షుడు బలరామ్‌ పమ్మి తోపాటు పలువురు టిఎల్‌సిఎ నాయకులు, సభ్యులు కుటుంబ సమేతంగా వచ్చి దేవాలయాలను సందర్శించుకుని ఆధ్యాత్మిక అనుభవాలను అందరితో పంచుకున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events