ప్రతిష్ఠాత్మక టైమ్ మ్యాగజైన్ అత్యంత 100 మంది ప్రభావశీలుర జాబితా-2024లో మన దేశానికి చెందిన పలువురు ప్రముఖులు చోటు దక్కించుకొన్నారు. వీరిలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రో సాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియా భట్, ఒలింపియన్ రెజ్లర్ సాక్షి మాలిక్, నటుడు దేవ్ పటేల్ తదితరులు ఉన్నారు. టైమ్ మ్యాగజైన్ ఈ లిస్టును విడుదల చేసింది. అజయ్ బంగా ప్రపంచ బ్యాంక్‌కు అధ్యక్షుడైన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని సాక్షి మాలిక్ సీనియర్ రెజ్లర్లతో కలిసి ధర్నా నిర్వహించి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఈ జాబితాలో రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ భార్య యులియా పేరు కూడా ఉన్నది.