Namaste NRI

భారతీయ శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మకమైన అవార్డు 

పోషకాహార రంగంలో విశేష పరిశోధనలు చేసినందుకు గాను భారతీయ శాస్త్రవేత్త డాక్టర్ స్వాతినాయక్‌కు 2023 కు సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకమైన నార్మన్ ఇ బొర్లాగ్ అవార్డు వరించింది. నోబెల్ బహుమతి గ్రహీత, హరిత విప్లవ రూపశిల్పి డాక్టర్ ఇ బొర్లాగ్ గౌరవార్థం వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ ఈ అవార్డును నెలకొల్పింది. ఒడిశాకు చెందిన ఈ మహిళా శాస్త్రవేత్త ప్రస్తుతం న్యూఢిల్లీ లోని ఇండియన్ ఇంటర్నేషనల్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ (ఐఆర్‌ఆర్‌ఐ)లో పరిశోధనలు చేస్తున్నారు. స్వాతినాయక్‌ను అత్యుత్తమ యువశాస్త్రవేత్తగా ఫౌండేషన్ అభివర్ణించింది. ఐఆర్‌ఆర్‌ఐ లో విత్తన విధానం,  ఉత్పత్తి యాజమాన్య విభాగం దక్షిణాసియా ప్రతినిధిగా స్వాతినాయక్ వ్యవహరిస్తున్నారు. డిమాండ్ ఆధారిత వరి విత్తన వ్యవస్థలు, పరీక్షించడం నుంచి అందరికీ అందుబాటు లోకి తీసుకురావడంలో నూతన ఆవిష్కరణలు కనుగొన్నందుకు ఈ అవార్డు ప్రదానం చేయనున్నట్టు ఫౌండేషన్ వివరించింది. . ఆహారం, పోషకాహార భద్రత, ఆకలి నిర్మూలన రంగం లో విశేష కృషి చేసిన 40 ఏళ్లలోపు వయసుగల శాస్త్రవేత్తలకు ఈ పురస్కారాన్ని ఇస్తారు.  అమెరికా లోని డెస్ మోయినెస్‌లో అక్టోబర్ 2426 తేదీల్లో 2023 నార్మన్ ఇ బొర్లాగ్ అంతర్జాతీయ సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈ అవార్డును స్వాతినాయక్ అందుకుంటారు. ఈ అవార్డు సాధించిన మూడవ భారతీయ వ్యక్తిగా, మొదటి ఒడిస్సా ప్రతినిధిగా రికార్డుకెక్కారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events