వివిధ రంగాలలో చేపట్టిన దాతృత్వ కార్యక్రమాలకు ప్రముఖ దాత, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌కు ప్రతిష్టాత్మకమైన కేఐఎస్‌ఎస్ (కిస్) మానవతా అవార్డు-2023ను ప్రదానం చేశారు. ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగిన కార్యక్రమంలోనూతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యం, విద్య, వాతావరణ మార్పు రంగాలలో చేపట్టిన కార్యక్రమాలలో భాగస్వామి అయ్యి అసమానతలను తగ్గించడానికి బిల్‌గేట్స్ చేస్తున్న కృషికి ఈ అవార్డు అందజేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. తనకు అవార్డు ప్రదానంచేయడం పట్ల బిల్‌గేట్స్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన లింగ సమానత్వంపై ప్రసంగించారు. 2008లో ప్రొఫెసర్ అచ్యుత సమంత ప్రవేశపెట్టిన ఈ కిస్ మానవత్వ అవార్డును ప్రపంచ వ్యాప్తంగా మానవసేవకు విశేషంగా కృషి చేస్తున్న వ్యక్తులు, సంస్థలకు ప్రదానం చేస్తున్నారు.